True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు


 

మంత్రి పయ్యావుల కేశవ్‌కు కృతజ్ఞతలు

ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి విజయ ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం ఉరవకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేసి మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి తమ ఆనందాన్ని పంచుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఈ విజయాలు పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని, ప్రజలు తెలుగుదేశం పార్టీపై ఉంచిన నమ్మకానికి ప్రతిబింబమని తెలిపారు. విజయం సాధించిన ఎంపీటీసీ అభ్యర్థులందరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తమ తమ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.


↑