True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

స్థానిక సంస్థల ఎన్నికలు: విజయ దుందుభి మోగించిన కాకతీయ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాకతీయ సామాజిక వర్గ ప్రజాప్రతినిధుల విజేతల జాబితా విడుదల

ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రకటన.. తొలి విడతలో 11 మంది విజేతల వివరాలు వెల్లడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నవంబర్ 1న జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు ఏపీ కాకతీయ సేవా సమాఖ్య (APKSS) అభినందనలు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కాకతీయ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ల వివరాలను సేకరిస్తున్న సమాఖ్య.. తొలి విడతగా రాయలసీమ జోన్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లా విజేతల జాబితాను విడుదల చేసింది.

సమాఖ్య జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్నూలు కార్పొరేషన్‌లో 27వ వార్డు నుంచి జంపాల మధుసూదనరావు 1,042 ఓట్ల మెజారిటీతో, 55వ వార్డు నుంచి కొరకంచి రవికుమార్ 342 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 22వ వార్డు నుంచి నంబూరి సురేష్ చౌదరి 685 ఓట్ల మెజారిటీతో, 26వ వార్డు నుంచి భాస్కర్ల సుభద్రమ్మ 649 ఓట్ల మెజారిటీతో, 18వ వార్డు నుంచి మలసాని సువర్ణ 306 ఓట్ల మెజారిటీతో, 19వ వార్డు నుంచి గుంటుపల్లి భాస్కర్ 232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

బేతంచర్ల మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి పోలూరు సోమశేఖరరెడ్డి 351 ఓట్ల మెజారిటీతో, 11వ వార్డు నుంచి యర్రమనేని షేక్షావలి 198 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆదోని మున్సిపాలిటీలో 29వ వార్డు నుంచి గుంటుపల్లి రామాంజనేయులు 95 ఓట్ల మెజారిటీతో, 5వ వార్డు నుంచి మరాతి మాధవి 80 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 20వ వార్డు నుంచి కరుపాటి విజయ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు మున్సిపాలిటీలలో తమ సామాజిక వర్గానికి చెందిన విజేతలు ఎవరూ లేరని సమాఖ్య తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా కాకతీయ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయడమే ఈ జాబితా సేకరణ ప్రధాన ఉద్దేశమని బెజవాడ వెంకట్రావు పేర్కొన్నారు. జాబితాలో ఎవరైనా విజేతల పేర్లు మిస్ అయి ఉంటే సమాఖ్య దృష్టికి తీసుకురావాలని కోరారు. మిగిలిన జిల్లాలకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే సేకరించి విడుదల చేస్తామని వెల్లడించారు.

↑