బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్.. ప్రజలకు లడ్డూల పంపిణీ
గుంతకల్లు: భారత మాజీ ఉప ప్రధాని, భారతరత్న పురస్కార గ్రహీత, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంతకల్లు పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న జెండా స్తూపం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ప్రజలకు లడ్డూలు, మిఠాయిలు పంపిణీ చేశారు.
బీజేపీ సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడిగా లాల్ కృష్ణ అద్వానీ సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి కొలిమి రామాంజనేయులు, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి. రంగన్న, నమామి గంగే రాష్ట్ర మాజీ సభ్యుడు కొలిమి శేఖన్న, ఏబీవీపీ పూర్వ నాయకుడు, మాజీ కౌన్సిలర్ వై. సుధాకర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి విశ్వనాథ్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జి. కృష్ణమూర్తి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు జీలకర్ర విక్రమ్, తిమ్మప్ప, వీరేష్, జయరాములు, నాగరాజు, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు.


