True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ, గవి మఠం దేవాదాయ ఆస్తుల అక్రమాలు.. అధికారుల బేఖాతారుపై సర్వత్రా విమర్శలు!

చట్టం బోర్డులకే పరిమితం.. దేవాదాయ భూములకు రక్షణ ఏది?

ఉరవకొండ:గవిమఠ సంస్థానం చేళ్ళ గురికి దేవాదాయ, ధార్మిక సంస్థల భూములను కాపాడాల్సిన అధికారులే చట్టానికి తూట్లు పొడుస్తున్నారా? 'సెక్షన్ 80' హెచ్చరిక బోర్డులు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయా? అంటే అవుననే విమర్శలు వ్యక్తమవుతున్నాయని లోకాయుక్త ఫిర్యాదీ మీనుగ మధు బాబు ధ్వజ మెత్తారు.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ చట్టం-1987 లోని సెక్షన్ 80 ప్రకారం కమీషనర్ అనుమతి లేని ఎలాంటి భూముల లావాదేవీలు చెల్లవని ఒకవైపు హెచ్చరిస్తున్నా, మరోవైపు ఆక్రమణలు, అక్రమ మ్యూటేషన్లు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.

జగద్గురు పేరు తీసేసి.. సొంత కుటుంబ పేర్లతో అక్రమ మ్యూటేషన్!

గుంతకల్లు దేవాదాయ శాఖ ఈఓ (EO) మఠం మల్లికార్జున వ్యవహారం దేవాదాయ శాఖలో తీవ్ర కలకలం రేపింది. జగద్గురు పేరిట ఉన్న దేవాదాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా తొలగించి, తన పేరిట మరియు తన కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా మ్యూటేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తీవ్రమైన అక్రమంపై కర్ణాటకలోని పీడీ హళ్లి పోలీస్ స్టేషన్‌లో 420 క్రిమినల్ కేసు నమోదు కావడం దేవాదాయ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది.

బోర్డులు ఏర్పాటు చేసినా ఆక్రమణలు ఆగలేదు!

వివాదాస్పద దేవాదాయ భూముల విషయంలో మునుపటి అసిస్టెంట్ కమీషనర్ (AC) గంజి మల్లికార్జున ముందస్తు చర్యగా బహిరంగ వేలానికి సిద్ధం చేసి, ఆక్రమణలను నిరోధించేందుకు స్పష్టమైన హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే చివరి క్షణంలో భూముల వేలం వాయిదా పడింది.

ఇంతవరకు బాగానే ఉన్నా, దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సాక్షిగా ఆక్రమణదారులు, పైగా కొందరు శాఖాధికారులే ఆ ఆదేశాలను పూర్తిగా బేఖాతారు చేయడం వెనుక ఉన్న అంతర్గత 'మతలబు' ఏమిటనేది ఇప్పుడు సమాజంలో అర్ధం కాని పెద్ద ప్రశ్నగా మారింది.

అధికారుల హామీలు నీటి మూటలేనా?

ఇటీవల డిప్యూటీ కమీషనర్ (DC)రామాంజనేయులు నిర్వహించిన విచారణ సందర్భంలో.. అధికారులు స్వయంగా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సహితం లెక్కచేయకుండా ఆక్రమణదారులు సదరు భూముల్లో పంటలు సాగు చేస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికిమధు బాబు తీసుకువెళ్లారు.

ఈ విషయంపై స్పందించిన డిసి (DC), ఇది నిజమని తేలితే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ, రోజులు గడుస్తున్నా ఆ హామీ "హామీగానే" మిగిలిపోయింది తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చట్టాన్ని కఠినంగా అమలు పరిచి దేవాదాయ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అక్రమ మ్యూటేషన్లకు పాల్పడిన వారిపై, హెచ్చరిక బోర్డులను ధిక్కరించి ఆక్రమణలకు దిగిన వారిపై సెక్షన్ 80, 83 & 84 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలనిభక్తులు, మధు బాబు డిమాండ్ చేస్తున్నారు.


↑