ఉరవకొండ, నవంబర్ 2026:
ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు సైదం వెంకటేష్ (అలియాస్ ఫోటోస్టాట్ వెంకటేష్) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆయన, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడిగా ఎదిగారు.
ప్రజా సంక్షేమమే ఊపిరిగా..
కార్యకర్త స్థాయి నుంచి.నాయకుడు .: కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన, పయ్యావుల కేశవ్ విజయానికి, పయ్యావుల సోదరుల రాజకీయ ప్రస్థానానికి వెన్నెముకగా నిలిచారు. వారి కోసం ప్రాణమిచ్చేందుకైనా సిద్ధపడే నిజమైన సైనికుడిగా గుర్తింపు పొందారు.
* చేనేత,ల పోరాటం: పట్టణంలో అత్యధిక జనాభా కలిగిన చేనేత మరియు సెదర్ల వర్గాల సంక్షేమం కోసం ఆయన అనేక ఉద్యమాలు చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పే ఫుట్‌పాత్ బాధితులకు అండగా: దలకు సకాలంలో అందేలా అధికారులపై, బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేకూర్చారు.
* ఫుట్‌పాత్ బాధితులకు అండగా: పట్టణంలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు సమయంలో బాధితులకు అండగా నిలబడి వారి పక్షాన ఉద్యమించారు.
* నిరుద్యోగులకు ఉచిత సేవలు: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఉచితంగా ఫోటోస్టాట్ (జెరాక్స్) సేవలు అందిస్తూ అండగా నిలిచారు. వినియోగదారులు ఎలాంటి ఆర్థిక దోపిడీకి గురికాకుండా అత్యంత తక్కువ ధరలకే సేవలు అందిస్తూ.. కేవలం 'సైదం వెంకటేష్'గానే కాకుండా 'ఫోటోస్టాట్ వెంకటేష్' గా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
అన్ని వర్గాల ఆదరణ – ప్రజల మనిషిగా గుర్తింపు
ఉరవకొండ గడ్డపై పుట్టి పెరిగి సాంకేతిక విద్యనభ్యసించిన ఆయన, అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎలాంటి అరమరికలు లేని సామాన్యుడిలా మెలిగే ఈ నాయకుడు.. పార్టీ అధిష్టానం మరియు పయ్యావుల సోదరులు అవకాశం కల్పిస్తే ఉరవకొండలో పార్టీ జెండాను విజయవంతంగా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉరవకొండలో ఇప్పుడు సర్పంచ్ రేసులో ఆయన పేరుపై జోరుగా చర్చ సాగుతోంది.
అభివృద్ధియే నా ధ్యేయం: ఫోటోస్టాట్ వెంకటేష్
చేనేత ఓటర్లు అధిక సంఖ్యలో కలిగిన ఉరవకొండలో ఏ వర్గం మద్దతు ఉంటే వారే గెలుపు తీరాలకు చేరుకుంటారన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు పయ్యావుల సోదరులు తనకు అవకాశం కల్పిస్తే..
* పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని,
* ప్రజల సౌకర్యార్థం నూతనంగా కాయగూరల మార్కెట్ ఏర్పాటు చేస్తామని,
* ప్రజలు సేద తీర్చుకోవడానికి ప్రత్యేకంగా పార్కును నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తామని ఫోటోస్టాట్ వెంకటేష్ (సైద వెంకటేశులు) స్పష్టం చేశారు.

