
మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన వజ్రకరూరు ఎంపీపీ అభ్యర్థి మాలపాటి లక్ష్మీ
ఉరవకొండ, ట్రూ టైమ్స్ ఇండియా, నవంబర్ 19: వజ్రకరూరు మండల ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికైన ఛాయాపురం గ్రామానికి చెందిన మాలపాటి లక్ష్మీ గురువారం పెద్ద కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
