మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన ఎంపీపీ అభ్యర్థి ఎర్రగుంట్ల నవనీత
ఉరవకొండ, ట్రూ టైమ్స్ ఇండియా, : ఉరవకొండ మండల ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికైన ఎర్రగుంట్ల నవనీత బుధవారం పెద్ద కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించినందుకు మంత్రి పయ్యావుల కేశవ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
