True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్

కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి

వాసవి పెనుగొండ, మేజర్ న్యూస్: పెనుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి కుడిపూడి శ్రీనివాసరావు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

నామినేషన్ కార్యక్రమానికి ముందు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుడిపూడి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కుడిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెనుగొండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామంలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

↑