ఆమెతో పాటు 10 మంది వార్డు సభ్యుల నామినేషన్లు
వజ్రకరూరు (ట్రూ టైమ్స్ ఇండియా): అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జెంగ్లీ వనజ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆమె సంబంధిత అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఆమెతో పాటు గ్రామంలోని 10 వార్డులకు పోటీ చేసే వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో చాబాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది.

