True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

బెలుగుప్పసర్పంచ్ అభ్యర్థిగా పెద్ద తిప్పయ్య నామినేషన్ దాఖలు.

ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా : బెలుగుప్పగ్రామపంచాయతీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద తిప్పయ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు సంపూర్ణ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. బెలుగుప్ప గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలందరూ తనకు మద్దతుగా నిలిచి సర్పంచ్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గెలుపే ఖాయమని ఆనందోత్సవాలతో నామినేషన్ ఊరేగింపులో పూలు చల్లుతూ నృత్యాలతో బెలుగుప్ప పట్టణమంతా పసుపుమయమైంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

↑