తొర్రూరు,
ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి
వరంగల్ పోలీస్ కమిషనర్ మరియు భద్రాద్రి జోన్ ఇన్చార్జి డీఐజీ ఎన్ శ్వేత ఐపీఎస్ బుధవారం తొర్రూరులోని డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు తొర్రూరుకు విచ్చేసిన డీఐజీకి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ మరియు తొర్రూరు డీఎస్పీ కె కృష్ణ కిషోర్లు పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలకగా అనంతరం పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ కీలక రికార్డులు నేరాల వివరాలు మరియు సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశమై పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల అణచివేతపై కీలక సూచనలు చేశారు కేసుల దర్యాప్తులో పూర్తి పారదర్శకత మరియు నాణ్యత పాటించాలని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్ తొర్రూరు డీఎస్పీ కె కృష్ణ కిషోర్ తొర్రూరు సీఐ టి గణేష్ మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ తొర్రూరు ఎస్ఐ టి మహేందర్ రెడ్డితో పాటు దంతాలపల్లి నర్సింహులపేట చిన్నగూడూరు పెద్దవంగర సీరోల్ మరియు మరిపెడ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


