True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

భీముని తండాలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు*


 


రెండు ఇళ్లలో గుడుంబా తయారీని గుర్తించిన పోలీసులు


 అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు 

ఎస్ఐ మహేందర్ రెడ్డి


తొర్రూరు:ట్రూ టైమ్స్ ఇండియా 

తొర్రూరు మండలం భీముని తండాలో అక్రమ గుడుంబా తయారీని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం తండాలో నిర్వహించిన ఈ తనిఖీల్లో రెండు ఇళ్లలో గుడుంబా తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా తొర్రూరు ఎస్ఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో హానికరమని పేర్కొన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ మరియు విక్రయాలపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ మహేందర్ రెడ్డి కోరారు

↑