True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

అమ్మాపురంలో తెగిపడిన విద్యుత్ వైరు తృటిలో తప్పిన పెను ప్రమాదం


 


నిమిషం వ్యవధిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారులు


విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం


 ట్రాన్స్‌ఫార్మర్ మార్చాలని డిమాండ్


తొర్రూరు, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి 

నవంబర్ 12:


తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామ ప్రధాన రహదారి పక్కన గురువారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో హెవీ విద్యుత్ వైరు ఒక్కసారిగా తెగిపడింది క్వారీకి వెళ్లే దారికి ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా అక్కడే ఉన్న చిన్నారులు నిమిషం వ్యవధిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ గురించి అమ్మాపురం విద్యుత్ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైరు తెగిపడిన విషయంపై అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా ప్రజలపైనే దురుసుగా మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపించారు ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై తొర్రూరు డివిజన్ మరియు జిల్లా స్థాయి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రద్దీగా ఉండే ఈ ప్రాంతం నుంచి హెవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను మరో సురక్షిత చోటుకు మార్చాలని అమ్మాపురం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

↑