True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలల పాటు అన్నదాన సేవలు


 

నవంబర్ 16 నుంచి జనవరి 16 వరకు ప్రతిరోజూ అన్నదానం.. భక్తులు, దాతలు సహకరించాలని కమిటీ విజ్ఞప్తి

ఉరవకొండ (ట్రూ టైమ్స్ ఇండియా):

శ్రీ అయ్యప్ప స్వామి భక్తుల కోసం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో రెండు నెలల పాటు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా షర్ఫుద్దీన్, షాబుద్దీన్, ఇమ్రాన్‌ల సహాయ సహకారాలతో అయ్యప్ప స్వాములకు, భక్తులకు ఆదివారం బిక్ష (అన్నదానం) కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు, మడకశిర పంచాయతీరాజ్ డీఈఈ మీనుగ వెంకటేశులు, కమిటీ సభ్యులు మీనుగ ప్రియతమ్, వెట్టి నాగమణి, ఎం. ఎల్లప్ప, తొండ్లం పరుశురాముడు, ఎత్తినెట్టి వీరేష్ బాబు తదితరులు మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సర కార్తీక మాసం శుక్లపక్ష సప్తమి అయిన నవంబర్ 16 నుంచి మాఘమాసం శుక్లపక్ష అష్టమి జనవరి 16 వరకు రెండు నెలల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

2006లో ప్రారంభమైన ఈ అన్నదాన సేవా కార్యక్రమం దాతలు, భక్తుల సహకారంతో నిరంతరాయంగా కొనసాగుతోందని వివరించారు. ఈ ఏడాది కూడా స్వామివారి ఆశీస్సులతో వందలాది మంది అయ్యప్ప స్వాములకు, భక్తులకు ప్రతిరోజూ అన్నప్రసాదం అందించనున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు తమకు ప్రాధాన్యత కలిగిన రోజున అన్నదానం నిర్వహించేందుకు రూ.5,116 విరాళంగా అందించాలని కోరారు. అదేవిధంగా ఆర్థిక సహాయం, ఆహార పదార్థాలు, వంట సరుకుల రూపంలో విరాళాలు అందించి అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

విరాళాలు, ఇతర వివరాల కోసం కమిటీ సభ్యుడు మీనుగ ప్రియతమ్‌ను 9440927915 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


↑