యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్’ అంటూ వ్యాఖ్యలు.. బదిలీతో సమస్య పరిష్కారం కాదు, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్‌ను బదిలీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సజ్జనార్‌ను ఉద్దేశించి 'యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ పోలీసు అధికారిపై విమర్శలు చేయడం బాధాకరంగా ఉన్నప్పటికీ, వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఒక అధికారిని బదిలీ చేయడం శిక్ష విధించినట్లు కాదని, బదిలీ చేసినంత మాత్రాన ఆరోపణలు తొలగిపోవని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సజ్జనార్‌పై తాను చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన చర్యలపై సమగ్ర విచారణ జరిపించి, తప్పులు నిర్ధారణ అయితే చట్టప్రకారం శిక్షించాలని ఎక్స్ (X) వేదికగా డిమాండ్ చేశారు.
నాగేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇవి ఆయన చేసిన ఆరోపణలు మాత్రమేనని, వాటిపై అధికారిక విచారణలో తేలే అంశాలు వేరుగా ఉంటాయి.

