True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

బిర్సా ముండా, సేవాలాల్ మహారాజ్ జయంతులకు ప్రభుత్వ సెలవు ప్రకటించాలి

 

అనంతపురం , ట్రూ టైమ్స్ ఇండియా : గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి, జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుగాలి గోపాల్ నాయక్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి హక్కుల పరిరక్షణ కోసం వీరోచితంగా పోరాడిన మహనీయుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించి దేశవ్యాప్తంగా నిర్వహించడం గిరిజన సమాజానికి గర్వకారణమన్నారు.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది గిరిజనుల మనోభావాలను, వారి చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి భగవాన్ బిర్సా ముండా జయంతితో పాటు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక సెలవు దినాలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులతో పాటు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల సమస్యలపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

గిరిజన యువతకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లు, దోపిడీని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మూడ్ కేశవ నాయక్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుగాలి గోపాల్ నాయక్ పాల్గొన్నారు.


↑