పాలకుర్తి నియోజకవర్గం,
ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి
నవంబర్ 22:
జలంధర్,
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో కొలువై ఉన్న ప్రసిద్ధ శక్తిపీఠం శ్రీ త్రిపురమాలిని దేవాలయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో సందర్శించారు ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అర్చకులు మరియు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు అనంతరం గర్భగుడిలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు
ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాన్ని అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ లోకకల్యాణం కోసం దేశ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు ఆలయ ప్రాంగణంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో ఆమె కొంత సమయం ప్రశాంతంగా గడిపారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట పలువురు నాయకులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

