True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

 ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి నామాల సుకన్య. 

కణేకల్  ట్రూ టైమ్స్ ఇండియా :


గరుడ చేడు గ్రామపంచాయతీ పరిధిలోని గరుడ చెడు, మీనహళ్లి గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామాల, సుకన్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచ్ అభ్యర్థికి ప్రకటించిన మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గరుడచేడు పంచాయతీని అభివృద్ధి పథకంలో నడిపిస్తానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ పార్టీ అధికారంలో ఉంది పనులు చేయించడానికి ముందుంటానన్నారు. పక్కా ఇల్లు, ఇంటి స్థలాలు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వికలాంగులు, వితంతులు పింఛన్లు అర్హులైన వారికి మంజూరు చేయిస్తానన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు మంజూరుకు ఎమ్మెల్యేతో సంప్రదించి మంజూరు చేయిస్తానన్నారు.

↑