True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

తొర్రూరు – కంటాయపాలెం రహదారికి మహర్దశ*


 


 *రూ.4.92 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన* 


మహబూబాబాద్ జిల్లా/తొర్రూరు, ట్రూ టైమ్స్ ఇండియా:

తొర్రూరు మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తొర్రూరు – కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి  ఈ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు తొర్రూరు పట్టణం నుంచి కంటాయపాలెం గ్రామానికి వెళ్లే ఈ మార్గం గుండా నిత్యం పలు గ్రామాల రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజల ప్రయాణ కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రూ.4.92 కోట్ల నిధులను మంజూరు చేయగా, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ పనులు ప్రారంభమయ్యాయి 

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు 

ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణం మరింత సులభతరం కానుండటంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు

↑