True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఆదర్శ విద్యార్థి అవార్డుకు ఎంపికైన ఎస్.కె. జంగి బంజారా

 

ఉరవకొండ: స్థానిక నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఆదర్శ విద్యార్థి' ఎంపిక పోటీలలో ఎస్.కె. జంగి బంజారా ప్రథమ స్థానం సాధించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జంగి బంజారా తొమ్మిదవ తరగతి చదువుతున్నారని పేర్కొన్నారు.

ఈ పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థికి బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జంగి బంజారాను గురుకులం ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శర్మాస్ వలి ప్రత్యేకంగా అభినందించారు.


↑