True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ లయన్స్ క్లబ్‌కు ఉత్తమ సేవా పురస్కారం

 

గూడూరులో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో అవార్డు ప్రదానం 

ఉరవకొండ:ఉరవకొండ లయన్స్ క్లబ్‌కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. సమాజ సేవా కార్యక్రమాల్లో క్లబ్ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఇటీవల నిర్వహించిన లయన్స్ క్లబ్ 316జే రెండవ మంత్రివర్గ సమావేశంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సమావేశానికి 316జే జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ లయన్ విరుపాక్షి రెడ్డి, ప్రథమ ఉప జిల్లా గవర్నర్ ఎం.వి. రావు, మాజీ జిల్లా గవర్నర్లు గోపాలకృష్ణ, డి.ఎస్. కుమార్‌తో పాటు పలువురు లయన్ ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉరవకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ కరణం వేదమూర్తి, జోన్ ఛైర్మన్ లయన్ సి. నాగేశ్వరరావులకు జిల్లా గవర్నర్ విరుపాక్షి రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఉరవకొండ లయన్స్ క్లబ్‌కు జిల్లా స్థాయిలో ఈ గుర్తింపు లభించడం పట్ల క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

↑