True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఎంపీపీ అభ్యర్థిపై అధిష్టానానిదే తుది నిర్ణయం

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీటీసీలు

ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా నవంబర్ 18: నేడు జరగనున్న ఉరవకొండ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు తమ అభిప్రాయాలను పార్టీ నాయకత్వం ముందు స్పష్టం చేశారు. ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా తామంతా ఏకగ్రీవంగా అంగీకరిస్తామని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేకుండా పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నికకు ముందు ఎంపీటీసీ సభ్యులంతా ఒకే మాటపై నిలబడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధిష్టానం ఎంపీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు రాయంపల్లి నాగరాజు, విజయ్ భాస్కర్, ప్యారం కేశవానంద తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

↑