True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కంటాయపాలెం గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


గ్రామ అధ్యక్షులుగా మందపూరి శ్రీధర్ నియామకం 

 ప్రధాన కార్యదర్శులుగా గంగదారి యాకాంబ్రం, పంజాల అల్లూరు 

 రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాన్ని గెలిపించి ఎమ్మెల్యేకు కానుకగా ఇస్తామని హామీ

తొర్రూరు, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి,నవంబర్ 17: తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎనగందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు సమావేశమై ఈ ఎన్నికను పూర్తి చేశారు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా మందపూరి శ్రీధర్ ప్రధాన కార్యదర్శులుగా గంగదారి యాకాంబ్రం మరియు పంజాల అల్లూరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
ప్రధాన కార్యదర్శులుగా గంగదారి యాకాంబ్రం, పంజాల అల్లూరు

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి మండల కమిటీ సభ్యులు గ్రామ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ అందరం సమిష్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బహుమతిగా అందిస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
↑