True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

పచ్చ చొక్కాలకు కాసుల పంట పండిస్తున్న హంద్రీ-నీవా..కేవీ రమణ

 

     కరువు నేలను సస్యశ్యామలం చేయాల్సిన హంద్రీ-నీవా పచ్చ చొక్కాలకు కాసుల పంటగా మారిపోయింది.2012 నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి కానీ ఒక్క ఎకరాకు పారిందిలేదు.

     కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి దశ వెడల్పు,రెండవ దశ లైనింగ్ పనులకు 3850 కోట్ల నాసిరకం పనులు చేసి టిడిపి గుత్తేదారులు,ప్రజా ప్రతినిధులు కుమ్మక్కు అయ్యి సుమారు 1000 కోట్లు దోపిడీ చేశారు.అందులో స్థానిక మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు చంద్రబాబు,లోకేష్ బాబులకు కూడా భాగం ఉన్నదని అందుకే చేసిన పనులు కొట్టుకు పోయినా తిరిగి అవే పనులకు సంబంధిత కాంట్రాక్టర్లకు నజరానాలు ప్రకటించారన్న చర్చ జరుగుతున్నది.

     అటు నాసిరకం పనులు చేసి టిడిపి గుత్తేదారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడితే,ఇటు కాలువ గట్టుమీద మట్టిని అక్రమంగా రోజు వందల ట్రిప్పులు తోలుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా,లైనింగ్ పనుల వల్ల అటు నేరుగా పంట పొలాలకు నీరు ఇచ్చింది లేదు,ఇటు భూగర్భ జలాలు పెంపొందక రైతుల పంటలు ఎండిపోయి అలమటిస్తున్నారు.అయితే అటు కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో ప్రజాధనాన్ని,ఇటు స్థానిక తెలుగుదేశం నాయకులు కాలువ మట్టిని అమ్ముకొని, కాలువ గట్టును కనుమరుగు చేస్తూ కాసుల పంట పండించు కుంటున్నారు.

    ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా అటు పోలీసులు కానీ,ఇటు రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడం అంటే వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనే చర్చ జరుగుతున్నది.

    వజ్రకరూరు,ఉరవకొండ గ్రామ పరిసరాల మీదుగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ గట్టు పైన మట్టిని తరలిస్తున్నారు.దీనికి గుంతకల్లు దగ్గరగా ఉండడంతో అక్రమార్కులకు కాసుల పంట పండుతోంది. టిప్పర్లతో మట్టిని లేఔట్లకు ఇతర అవసరాలకు అక్రమంగా తరలిస్తున్నారు.ఒక్కో ట్రిప్పర్ లోడు 4000 పలుకుతున్నది.ఈ లెక్కన రోజు లక్షలు వెనకేసుకుంటున్నారు. దీనివల్ల

భారీ వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో నీరు కాలువలోకి ప్రవేశించి కాలువ గట్టు దెబ్బ తినడమే కాకుండా పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతాయి.దీనివల్ల భవిష్యత్తులో హంద్రీ-నీవా కాలువ ఎక్కడపడితే అక్కడ తెగిపోయే ప్రమాదం ఉన్నది. 

     దీనిని బట్టి హంద్రీ-నీవా కాలువ రైతులకు ఏమాత్రం 

ఉపయోగపడుతుందో ఏమో కానీ,పచ్చ చొక్కాలకు మాత్రం కాసుల పంట పండిస్తున్నది

↑