గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి
బ్రహ్మసముద్రం: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ మండల కన్వీనర్ వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి, అందరినీ కలుపుకొని నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని వెల్లడించారు.

