True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

నూతన వధూవరులను ఆశీర్వదించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

                                             

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వివాహ వేడుకకు హాజరు.. 

పాలకుర్తి, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి: పాలకుర్తిలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఆయన ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పోతర్ల సమ్మయ్య కుమారుడు ప్రశాంత్ వివాహం సింధుజతో పాలకుర్తి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు.

ఈ వివాహ వేడుకలో రాయపర్తి మండల ముఖ్య నాయకులు లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, పెందోట శివ, స్థానిక నాయకులు బెల్లి అనూష, చిలువేరు కొమురమ్మ, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.

↑