వైసిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు ఆద్వర్యంలో వైసిపిలో చేరిక
కళ్యాణదుర్గం, ట్రూ టైమ్స్ ఇండియా: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు, దళిత జన జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కే. రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ నారాయణపురం తలారి వెంకటేశులు ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశులు పార్టీ కండువా కప్పి ఆర్.కే. రాజును పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆర్.కే. రాజు మాట్లాడుతూ రానున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నారాయణపురంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

