True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

తొర్రూరులో ఘనంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం

నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పూర్తి పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు

తొర్రూరు , ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి ,నవంబర్ 16: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ విశిష్ట అతిథిగా హాజరుకాగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఎలాంటి అవినీతికి రాజకీయ సిఫార్సులకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించామని స్పష్టం చేశారు లబ్ధిదారులకు అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన నివాసాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తునం శ్రవణ్ కుమార్ వైస్ చైర్‌పర్సన్ సోమ రజిని అదనపు కలెక్టర్ మరియు హౌసింగ్ పీడీ పురుషోత్తం మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

↑