True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

తూముకుంటలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేత?

 

గాలివీడు: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుడుముల ఆంజనేయులు రెడ్డి నామినేషన్ పత్రాలను చించివేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ ఘటనకు సంబంధించి గాలివీడు టీడీపీ మండల అధ్యక్షుడు కుమార్ రెడ్డి పాత్రపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు. నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించడం, నామినేషన్ పత్రాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై ఎన్నికల అధికారులు, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

↑