True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*

తొర్రూరు ,ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి నవంబర్ 12:ఈ నెల 15న నల్గొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం తొర్రూరు మండల కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు గురువారం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో మహాసభల గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా వేదికగా నాలుగు రోజుల పాటు ఎన్జీ కళాశాల మైదానంలో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ సభలు ఎంతో కీలకమని పేర్కొన్నారు లక్షలాది మంది రైతులతో జరిగే ఈ మహాసభలకు ఊరుకో బండి ఇంటికి ఒకరు చొప్పున రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజాస్వామ్యవాదులు వామపక్షవాదులు భారీగా తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొల్లం అశోక్ దొనక దర్గయ్య తిమ్మిడి రవి యాసరపు వెంకన్న పాక వెంకన్న గుడెల్లి వెంకన్న సైదులు సమ్మయ్య బోట్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

↑