True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి నిధులు కాజేసిన కుమారుడి అరెస్ట్*

గూడూరు మండలం గుండెంగ గ్రామ పంచాయతీలో వెలుగుచూసిన నిధుల దుర్వినియోగం

మహబూబాద్ జిల్లా/గూడూరు,ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి,నవంబర్ 12:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు కాజేసిన ఘటన కలకలం రేపింది ప్రజాప్రతినిధుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తూ అక్రమాలకు పాల్పడటంపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై సర్పంచ్ కుమారుడు బోడ కిషన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి చిరంజీవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మహబూబాబాద్ కోర్టులో హాజరుపరిచారు

↑