True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

నిరుపేద కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్* చేయూత


మైలారంలో నిరుపేద కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండ

అబ్బులు మృతితో విషాదంలో ఉన్న కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

రాయపర్తి, నవంబర్ 14 (ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి):పేదలు, నిరుపేదలు, నిస్సహాయులకు అండగా నిలవడమే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

శనివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అబ్బులు కుటుంబాన్ని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం కల్పించారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున 50 కేజీల బియ్యాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, పెందోట శివ, వార్డు సభ్యులు పరుపాటి రవీందర్ రెడ్డి, బెల్లి అనూష, ఎల్లయ్య, ముఖ్య నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గుడెల్లి వెంకటయ్య, పశునూరి శ్రీనివాస్, బొమ్మినేని సురేందర్ రెడ్డి, ఊళ్లేంగల శ్రీనివాస్, సంకినేని ఎల్లస్వామి, బాధ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

↑