True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించండి!

 

ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ఎర్రజెండా అభ్యర్థులకే పట్టం కట్టాలి!

– సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి. అంజిబాబు, ప్రాంతీయ కార్యదర్శి పి. హనుమంతు

ఆలూరు నవంబర్ 14 ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి న్యూస్:ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ముందుగా గుర్తుకొచ్చేది ఎర్రజెండా అని, ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే సీపీఎం బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి. అంజిబాబు, ప్రాంతీయ కార్యదర్శి పి. హనుమంతు, సీనియర్ నాయకులు కె. నారాయణస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు.

శనివారం ఆలూరులోని జ్యోతిబసు భవన్‌లో నిర్వహించిన ముఖ్య పార్టీ సభ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్న ఎర్రజెండా అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే నాయకులు కాకుండా.. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులపై ఒత్తిడి తెచ్చి పోరాడే నాయకులే గ్రామాలకు అవసరమని వారు స్పష్టం చేశారు.

సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న సీపీఎం బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు షాకీర్, వెంకటేష్, కృష్ణ, మైనా, షేకున్ బీ, గోవర్ధన్, ఈరన్న, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రజెండా అండగా ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. ప్రజల గొంతుకగా నిలిచే అభ్యర్థులను గెలిపించండి!

↑