గుంతకల్ మున్సిపల్ కౌన్సిలర్ మూర్తి నాయక్ ఘన సన్మానం
గుంతకల్ పురపాలక సంఘం 41 కౌన్సిలర్ గా ఇటీవల ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన రమావత్ కృష్ణ నాయక్ ను గురువారం వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా గ్రామ బంజారా సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో బంజారా సంఘం జాతీయ గౌరవాధ్యక్షులు ఎస్కే కేశవ నాయక్ మాట్లాడుతూ గుంతకల్లు పట్టణం భాగ్యనగరం నివాసి రమావత్ కృష్ణ నాయక్ స్వసంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంజారా సంఘం ప్రతినిధులు నంగరేయర్ నాయక్ ఎస్.కె సుబ్రహ్మణ్యం అనంతపురం బార్ కౌన్సిల్ అధ్యక్షులు అడ్వకేట్ ధర్మ సింగ్ నాయక్ మాజీ ఎంపీ స్వామి నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు కమల్ సింగ్ రాథోడ్ ఎం నారాయణ నాయక్ మహిపతి నాయక్ గోవిందు నాయక్ చీకు నాయక్ లలితా బాయ్ సుశీలబాయి దేవమ్మ తదితరులు పాల్గొన్నారు
© True Times India. ఈ వార్తలు, ఫోటోలను అనుమతి లేకుండా కాపీ చేయడం, తిరిగి ప్రచురించడం చట్టరీత్యా నేరం.

