True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి

 

హైదరాబాద్, ట్రూ టైమ్స్ ఇండియా ప్రతినిధి, నవంబర్ 14:  హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారత్ సమ్మిట్ ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులతో కలిసి ఆమె ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో భాగమయ్యారు ఈ సందర్భంగా సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన పలు కీలక సమావేశాలు ప్రత్యేక చర్చా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు సమగ్ర సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత మరియు భవిష్యత్తు ప్రపంచ నిర్మాణం వంటి ప్రధాన అంశాలపై జరిగిన చర్చలను నిశితంగా పరిశీలించారు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని సామాజిక మార్పులో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు ఇలాంటి అంతర్జాతీయ వేదికలు భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అభివృద్ధికి కొత్త బాటలు వేస్తాయని పేర్కొన్నారు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాల నిపుణులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

↑