True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కోనాపురంలో భారీ మిరప పంట చోరీ.. రూ.10 లక్షల పంట మాయం!

 రాత్రికి రాత్రే మిరప పంటను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.. లబోదిబోమంటున్న రైతు

బెలుగుప్ప (కోనాపురం), నవంబర్ 15 (ట్రూ టైమ్స్ ఇండియా):ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో చోరీకి గురికావడంతో ఓ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కోనాపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.10 లక్షల విలువైన మిరప పంటను రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రాత్రికి రాత్రే పంట చోరీ

కోనాపురం గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో మిరప పంటను సాగు చేశాడు. పంట కోతకు వచ్చి విక్రయానికి సిద్ధంగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ పొలంలోకి ప్రవేశించి భారీ మొత్తంలో మిరప పంటను చోరీ చేసినట్లు సమాచారం. సుమారు రూ.10 లక్షల విలువైన పంట మాయమైనట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ప్రతిరోజూ ఎంతో జాగ్రత్తగా పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతు ఉదయం పొలానికి వెళ్లి చూడగా పంట కనిపించకపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. నెలల తరబడి శ్రమించి పండించిన పంటను కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ ఘటనతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, అప్పుల భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
లక్షల రూపాయల విలువైన పంటను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేయడం గ్రామస్తులను విస్మయానికి గురిచేసింది. పోలీసులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ చేపట్టి, చోరీకి పాల్పడిన వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు.
↑