పెన్నహోబిలం ఆలయంలో ఘనంగా హుండీ లెక్కింపు: రూ. 25.97 లక్షల ఆదాయం!

Malapati
0

 

గత ఏడాదితో పోల్చితే రూ. 10.11 లక్షలు అదనంగా రాబడి

 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల కాలంలో భక్తులు స్వామివారికి సమర్పించుకున్న ముడుపులు, కానుకలను ఆలయ అధికారులు, ప్రముఖుల సమక్షంలో లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో, ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు ఆధ్వర్యంలో ఈ హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు.

36 రోజుల ఆదాయ హుండీ వివరాలు ఇలా ఉ


న్నాయి 

సాధారణ హుండీ ఆదాయం రూ. 25,96,507/- కాగా, అన్నదానం హుండీ ద్వారా రూ. 1,109/- వచ్చింది. రెండు కలిపి మొత్తం రూ. 25,97,616/- ఆదాయం లభించింది. గత సంవత్సరం హుండీ ద్వారా రూ. 15,85,888/- ఆదాయం రాగా, ఈసారి భక్తుల రద్దీ పెరగడంతో గత ఏడాది కంటే రూ. 10,11,728/- అదనపు ఆదాయం లభించిందని అధికారులుఈఓ సాకే రమేష్ బాబు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో , ఆలయ ధర్మకర్తలు మీనుగ రామకృష్ణ, చంద్రమౌళి స్వామి, మంగళ నారాయణప్ప, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు. వీరితో పాటు గుంతకల్లు హనుమాన్ సేవా సంస్థ సభ్యులు, భవాని సేవా సమితి (అనంతపురం) ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, బొల్లినేని ఓబులేసు, కురుబ ఎర్రిస్వామి, డబ్బర మురళి, అలాగే ఉరవకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఉరవకొండ కెనరా బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొని లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేసినట్లు ఈఓ సాకే రమేష్ బాబు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!