పెన్నాహోబిలం ఆలయంలో నేడు హుండీ లెక్కింపు

Malapati
0

 



అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిలం గ్రామమున వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నేడు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఇటీవల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల అనంతరం, భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

దేవస్థాన ప్రాంగణంలోని శాశ్వత హుండీలను బుధవారం (తేది: 20-05-2026) ఉదయం 09:00 గంటలకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ చైర్మన్ ఆర్. నాగరాజు, మరియు ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో తెరిచి కానుకలను లెక్కించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పర్యవేక్షకులు, సిబ్బంది మరియు ఆహ్వానితులు అందరూ సకాలంలో హాజరు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) యస్.రమేష్ బాబు ఒక ప్రకటనలో కోరారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!