:రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత పయ్యావుల శ్రీనివాసులు అనంతపురంలోని తన స్వగృహంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను57 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసాగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నామని పయ్యావుల శ్రీనివాసులు పేర్కొన్నారు.

