విడపనకల్లు,
:విద్యార్థుల విద్యాభ్యాసానికి పునాది వేసే అక్షరాభ్యాసం మరియు వారి ఎదుగుదలను చాటిచెప్పే గ్రాడ్యుయేషన్ వేడుకలను విడపనకల్లు మండలంలోని పాల్తూరు -6 అంగన్‌వాడీ కేంద్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ *పుష్పావతి* మరియు ఎంపీపీ స్కూల్ హెచ్.ఎం *మురళి నాయక్* ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 3 ఏళ్లు పైబడిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించగా, 5 ఏళ్లు నిండిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించి, వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా చిన్నారుల విద్యా ప్రస్థానంలో ఇది ఒక మైలురాయి అని, ఇలాంటి కార్యక్రమాలు వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయని అతిథులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆర్.లక్ష్మీదేవి ఈ.మల్లేశ్వరి *పి.నాగవేణిలతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ విద్యా ప్రస్థానంలో తొలి అడుగులు వేశారు.
