ఉరవకొండలో ఎం ఈ ఓ 'అదృశ్య' పాలన: విధులను విస్మరిస్తున్న ఎంఈఓపైచర్యలకు సిద్ధూ డిమాండ్

 



*ఉరవకొండ:* ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విద్యాశాఖ అధికారి కార్యాలయం, నేడు తాళం వేసిన స్థితిలో దర్శనమివ్వడం ఉరవకొండలో చర్చనీయాంశంగా మారింది. ఎంఈఓ ఈశ్వరప్ప అధికారిక సెలవులు తీసుకోకుండానే తరచూ వ్యక్తిగత పనుల కోసం కార్యాలయాన్ని వదిలి వెళ్లడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

యథా రాజా తథా ప్రజా’ - అధికారుల అనాలోచిత వైఖరి!

"యద్ భావం తద్భవతి" అన్నట్లుగా, అధికారి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటే, సిబ్బంది సైతం అదే బాటలో పయనిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయ స్థితిలో వెనుదిరుగుతున్నారు. విద్యాశాఖ కార్యాలయానికి తాళం వేసి ఉండటం, బాధ్యతాయుతమైన అధికారి కార్యాలయం పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అని స్థానికులు విమర్శిస్తున్నారు.


AIFDS రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ మాట్లాడుతూ.. "ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో వ్యక్తిగత పనులకు వెళ్లడం ఏ చట్టం? కనీసం సెలవు కూడా పెట్టకుండా, కార్యాలయాన్ని గాలికి వదిలేయడం అధికార దుర్వినియోగం కాదా?" అని ప్రశ్నించారు.

 నిర్లక్ష్యం: ఎంఈఓ గైర్హాజరు వల్ల కార్యాలయ పాలన స్తంభించి, విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.