రక్తానికి కులం లేదు మతం లేదు

Malapati
0


 

 12-6-2026న శుక్రవారం గుంతకల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు గల బ్లడ్ బ్యాంకు లో గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని *గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్ హరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది* ఇందులో గుంతకల్ ఎమ్మార్వో రమాదేవి తో పాటు రెవిన్యూ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా తారతమ్యాలు చూడకుండా ప్రాణం పోసే శక్తి ఒక రక్తదానానికి ఉందని రక్తానికి కులం గాని మతం గాని లేదని యువత స్వచ్ఛంద రక్తదానానికి సిద్ధం కావాలని అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం రక్తదానమైనని ఎలాంటి అపోహలకు తావు లేకుండా 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు *ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజేంద్రరావు. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పవిత్ర ప్రజ్ఞ.ల్యాబ్ టెక్నీషియన్లు సత్య.. ఉమా సాయి. మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ప్రభాకర్ మున్సిపల్ అధికారులు వినయ్ కుమార్. ఆదినారాయణ. సుధీంద్ర పాల్. కిషోర్. శ్రీనివాస్. రెవెన్యూ సిబ్బంది జాషువా. హేమల నాయక్. మరియు తదితరులు పాల్గొన్నారు*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!