ఐక్య విద్యార్థి సంఘాల హెచ్చరిక: చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్త ఉద్యమం!
ఉరవకొండ:
ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతూ, నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఉరవకొండ మండల విద్యాశాఖాధికారి తీరుపై ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'CSC ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్' నిర్వహణలో జరిగిన అక్రమాలపై విద్యార్థి నాయకులు నరసింహ, భీమేష్, ప్రతిభ భారతి తదితరులు గురువారం జిల్లా రెవెన్యూ అధికారి డీ ఆర్ ఓ ని కలసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు:
"ఉరవకొండ మండలంలో దాదాపు 15 ప్రైవేట్ స్కూళ్లు ఉంటే.. కేవలం 4 స్కూళ్లే చూస్తారా? ఎం ఈ ఓ గారి ‘కృప’ ప్రభుత్వ బడి మీద ఉందా.. లేక కార్పొరేట్ ప్రైవేటు బడుల యాజమాన్యాల మీద ఉందా?" అని నిలదీశారు.
నిజాలను నొక్కేసిన ఎం ఈ ఓ ప్రధాన ఆరోపణలు ఇవే..
అరకొర తనిఖీలు - అబద్ధపు నివేదికలు: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించాలనే సత్సంకల్పంతో, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా "C.S.C ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్" చేపట్టింది. కానీ ఉరవకొండఎం ఈ ఓ దీనిని పూర్తిగా ప్రహసనంగా మార్చేశారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారా?: మండలంలో 15 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే, తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న కేవలం 3 లేదా 4 చిన్న స్కూళ్లను మాత్రమే సందర్శించి చేతులు దులుపుకున్నారు. భారీగా ఫీజులు వసూలు చేసే పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలలను డ్రైవ్ పరిధిలోకి రాకుండా ఎం ఈ ఓ పూర్తిగా మినహాయించారు.
నివేదికల్లో మాయాజాలం: క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి డ్రైవ్ నిర్వహించకుండానే, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా ఒక అరకొర, అబద్ధపు నివేదికను సమర్పించారు. పెద్ద ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎం ఈ ఓ ఏవైనా ప్రయోజనాలు (లబ్ధి) పొందారా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
సమగ్ర విచారణ జరపాలి - లేదంటే ఉద్యమం తప్పదు!
ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతూ, నిరుపేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిన సదరు విద్యాశాఖాధికారిపై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డీ ఆర్ ఓ ని కోరారు. అలాగే మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 'CSC డ్రైవ్' పారదర్శకంగా, సక్రమంగా జరిగేలా రీ-సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎం ఈ ఓ పై చర్యలు తీసుకోని యెడల ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు, కలెక్టరేట్ ముట్టడి మరియు ఉధృతమైన ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.