శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల సర్కిల్ నూతన పోలీస్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన రాగిరి రామయ్యను నార్పల, గార్లదిన్నె ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నార్పల సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) సాగర్, గార్లదిన్నె సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) మహమ్మద్ గౌస్ భాషలు సీఐని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులపై సీఐతో వారు క్లుప్తంగా చర్చించారు.
3/related/default
