పరిశుభ్రతతో స్టాఫ్ డయోరియా

 

 


 - అతిసారం ఆపండి ప్రచారం కార్యక్రమం ప్రారంభం

 వజ్రకరూర్ జూన్ 16 

 వర్షాకాలం మొదలైంది. డయూరియా ముప్పు పొంచి ఉంటుంది ప్రధానంగా కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ప్రభలే అవకాశం ఉన్న ఈ వ్యాధి పిల్లలపై మరింత పంజా విసురుతుంది దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు స్టాఫ్ డయోరియా కార్యక్రమాన్ని ప్రారంభించామని వైద్య అధికారి డాక్టర్ తేజస్వి తెలిపారు. వైద్యరికారి మాట్లాడుతూ.... 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న గృహంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు రెండుసార్లు పర్యవేక్షించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలన్నారు. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పిల్లలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. డయోరియా భారీనా పడిన వారికి అనేకసార్లు నీళ్ల విరోచనాలు వాంతులు అవుతుంటాయి దీంతో ఎంత శాతం నీరు శరీరం నుంచి బయటకు వెళ్లి పోతుందో అంత శాతం నీటిని ఓఆర్ఎస్ రూపంలో వెంటనే అందించాలని లేకపోతే మూత్రపిండాలు విఫలమయ్యే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. సొంతంగా యాంటీబెటిక్ మందులను వాడకూడదు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలన్నారు. పెద్దవారిలో ఎక్కువగా బీపీ పడిపోవడం ద్వారా తీవ్ర అస్వస్థకు లోని అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా డయోరియా లక్షణాలు వాంతులతో మొదలయితాయి రెండవ రోజు విరోచనాలు అవుతాయి ఐదు నుంచి ఏడు రోజులు పాటు విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. వెంటనే దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్త ఏఎన్ఎం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ లక్ష్మీదేవి, ఎం పి హెచ్ ఈఓ గురు ప్రసాద్, కుమార్ స్వామి, సూపర్వైజర్ నాగ శంకర్, హెల్త్ అసిస్టెంట్లు నాగరాజు, సంపత్ కుమార్, ఫార్మ్ సిస్ట్ రామచంద్రనాయక్, ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.