టిడిపికి పౌరుషం రాదా?
జనసేన ఊగిపోదా?
బిజెపికి వినబడదా?
2024 కు పూర్వం ఆంధ్ర రాష్ట్రంతో పాటు,వివిధ రాష్ట్రాలు,దేశవ్యాప్తంగా పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని,ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని టెక్నాలజీ దిగ్గజం అలెన్ మస్క్ చెప్పాడని,కావున ఆ ఎన్నికలు రాజ్యాంగబద్ధం కాదని కావున ఆ ప్రభుత్వాలను రద్దు చేయాలని,ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని,సర్ పేరుతో కొన్ని వర్గాల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని,చివరికి ఓటరుగా ఎవరు ఉండాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించే దశకు ఎన్నికల కమిషన్ దిగజారిపోయిందని,ఓటు లేని వాడు ఈ దేశ పౌరుడే కాదని భవిష్యత్తులో నిర్ణయించే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును కాలరాస్తూ,అర్బన్ నక్సలైట్ల పేరుతో అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే 6.5 కోట్ల మంది ఓట్లు తొలగించారని,రానున్న రోజుల్లో 16 కోట్ల మంది ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇటువంటి వాటిపై ప్రశ్నిస్తే వికసిత్ భారత్ పేరుతో డ్రామాలాడుతూ కుల,మత, ప్రాంత,భాషా పరంగా ప్రజలను విభజించడానికి సాహసిస్తున్నారని ఇలాంటి దారుణాలను ఎదుర్కోవడానికి ప్రజలు రోడ్లమీదకు రావాలని,దేశంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక,సామాజిక అసమానతలు పెరిగిపోయాయని,బడుగు బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు,కర్షకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని,విద్య,వైద్యం, అక్షరాస్యత రంగాలలో అనేక చిన్న దేశాల కంటే వెనకబడి ఉన్నామని,ఉత్పాదక రంగంలో 133వ స్థానానికి,ఆకలి సూచీలో 120 స్థానానికి దిగజారిపోయినా భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిలో ఐదవ స్థానంలో ఉందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ప్రధానమంత్రి కౌశల్ యోజన (స్కిల్ ఇండియా) ఒక పెద్ద స్కాం గా మారిపోయిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ )నివేదిక స్పష్టం చేసిందని,స్కిల్ ఇండియా ద్వారా శిక్షణ పొందినట్లు చెబుతున్న వారిలో 61 లక్షల మంది పేర్లు,ఊర్లు లేవని 12,000 మంది మళ్లీ మళ్లీ శిక్షణను పాల్గొన్నట్లు రాసుకుని డబ్బులు తినేశారని,శిక్షణ పొందిన వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తే వారికి స్టైఫండ్ అందలేదని చెబుతున్నారని,కాగ్ నివేదిక ప్రకారం 95%బోగస్ అకౌంట్లు ఉన్నాయని,స్కిల్ ఇండియా పేరుతో డబ్బును దోచుకుంటున్నారని,ప్రముఖ ఆర్థిక,రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు దేశమంతా తిరిగి చర్చా వేదికల ద్వారా ప్రజలకు చెబుతూ,వాటిని నిరూపించడానికి సిద్ధమని ఛాలెంజ్ చేస్తుంటే,సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులకే పెద్ద శిక్షలు వేస్తున్న కూటమికి ఇంత తీవ్రమైన విమర్శల పట్ల టిడిపికి పౌరుషం రాలేదా,జనసేనకు కోపం రాదా,బిజెపి వినపడనట్లుగా వ్యవహరించడంలో మతలబు ఏమిటి?
ఆరోపణలలో నిజం లేదని పై మూడు పార్టీలు నమ్మితే అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అవి నిజమైతే దొడ్డిదారిన ఎన్నికైన ఈ ప్రభుత్వాలను,రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా రద్దు చేయాలి.
ప్రతిపక్షాలకు కూడా తగినంత స్పందన లేదు, ఉంటే దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించాలి,ఈ మోసాలకు కళ్లెం వేయాలి,మోసగాళ్లను తరిమికొట్టాలని కేవి రమణ పేర్కొన్నారు..
