ఉరవకొండ, జూన్ 17,
ఉరవకొండ మండల పరిధిలోని ఉన్నటువంటి నెరమెట్ల గ్రామంలో బుధవారం1,2,3 అంగన్‌వాడీ కేంద్రాలుకు సంబంధించి పిల్లల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఆర్డీటి స్కూల్ నందు ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,ఘనంగా నిర్వహించారు.సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ మూడు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ విద్యను పూర్తి చేసుకున్న15మందిచిన్నారులుచే అక్షరభాష్యం చేయించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగిందని,
అంగన్‌వాడీ దశలోనే పిల్లలకు అక్షరజ్ఞానంతో పాటు మంచి అలవాట్లు,పోషకాహారం అందుతుందని,ఆ పునాదితోనే ఉన్నత చదువుల కోసం ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు.బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, చదువుతున్న విద్యార్థులను డ్రాప్ చేయకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని బాగా చదివించాలన్నారు.చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయరాదని,బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు,అశ్వర్థమ్మ,పద్మావతి,మంజుల,ఆయాలు,మారెక్క,వనజాక్షి,చిన్నారులు,తల్లిదండ్రులు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
