తప్పిన పెద్ద ప్రమాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన టిప్పర్ లారీ


 

విడపనకల్లు: 

మండల పరిధిలోని N. తిమ్మాపురం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఒక భారీ ప్రమాదం తప్పింది. డోనేకల్లు చెరువు నుంచి N. తిమ్మాపురం గ్రామానికి మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి విద్యుత్ పోల్ విరిగి కిందపడిపోయింది.అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ లైన్లలో విద్యుత్ సరఫరా (పవర్ కట్) లేకపోవడంతో ఒక భారీ విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.