చీకలగురికి లో ఘనంగా అంగన్‌వాడీ చిన్నారుల అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ వేడుకలు

 

ఉరవకొండ 


:విడపనకల్లు మండలం, చీకలగురికి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 ఏళ్లు నిండిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించగా, 5 ఏళ్లు నిండిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ వేడుకలను అత్యంత ఘనంగా జరిపారు.

ఈ వేడుకలకు హాజరైన అతిథులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల చిన్నారులలో చదువు పట్ల ఆసక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఉత్సాహపరుస్తూ, విద్యాబోధనలో అంగన్‌వాడీల పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు కె.హేమలత, శాంత, రాజేశ్వరి, ఆయా సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.