ఉరవకొండ,
జూలై 16:
బంజారా సమాజ ఆరాధ్య దైవమైన శ్రీ శీతల భవాని పూజను ఈ నెల 21వ తేదీ (మంగళవారం) రూపానాయక్ తండాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమానికి భక్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ పూజా మహోత్సవాన్ని రూపానాయక్ తండా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కమిటీ సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పూజా కార్యక్రమంలో బంజారా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
